ఏపీలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా ఎన్నంటే ..?

ఏపీలో కరోనా తీవ్రత తగ్గింది. ఒక్కరోజు వ్యవధిలో 51,544 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,901 మందికి పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది.

  • Ram Naramaneni
  • Publish Date - 7:13 pm, Mon, 26 October 20

ఏపీలో కరోనా తీవ్రత తగ్గింది. ఒక్కరోజు వ్యవధిలో 51,544 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,901 మందికి పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,08,924కి చేరింది.  24 గంటల వ్యవధిలో 19 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,606కి చేరింది.  ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 3,972 మంది వ్యాధి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 28,770 యాక్టివ్‌ కేసులున్నాయి.

కొత్తగా జిల్లాలవారీగా మరణించిన వారి వివరాలు :

చిత్తూరు జిల్లాలో 4, కడప 3, కృష్ణా 3, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

Also Read  :

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును