లేటెస్ట్ రిపోర్ట్.. ఏపీని కంగారెత్తిస్తున్న కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నా.. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నా కరోనా కేసులేకదు..

లేటెస్ట్ రిపోర్ట్.. ఏపీని కంగారెత్తిస్తున్న కరోనా
Follow us

|

Updated on: Aug 30, 2020 | 8:06 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నా.. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నా కరోనా కేసులేకదు.. అటు మరణాలరేటూ ఎక్కువగా ఉండటం పాలుపోవడంలేదు. ఎందుకిలా జరుగుతుందోనని ఆంధ్రాజనం తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కంటిన్యూగా 10 వేలకు పైగా కొత్త కేసులు ప్రతీ రోజూ నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 88 మంది మృత్యువాత పడగా, 10,603 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది. ఇవాళ వచ్చిన రిపోర్ట్ ప్రకారం తాజాగా 9,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు మహమ్మారి భారినపడి కోలుకున్నవారి సంఖ్య3,21,754కి పెరిగింది. ఇవాళ్టి వరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కాగా, 99వేల129 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.