ఏపీలో కరోనా తగ్గుముఖం, తాజాగా ఎన్ని కేసులంటే !

పీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 5,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా తగ్గుముఖం, తాజాగా ఎన్ని కేసులంటే !
Follow us

|

Updated on: Sep 28, 2020 | 7:58 PM

ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 5,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 37 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచినట్లు వైద్యారోగ్య శాఖ నేటి హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,745 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 63,116 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,210 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ఇప్పటివరకు  6,12,300 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.

తాజాగా జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు :

తూర్పు గోదావరి జిల్లాలో 1010

పశ్చిమ గోదావరి 903

ప్రకాశం 634

గుంటూరు 538

నెల్లూరు 489

విజయనగరం 362

చిత్తూరు 329

అనంతపురం 310,

కడప 271

శ్రీకాకుళం 286

విశాఖ 145

కర్నూలు 113

కృష్ణా జిల్లాలో 97

తాజాగా జిల్లాల వారీగా మరణించిన వారి సంఖ్య :

ప్రకాశం జిల్లాలో అత్యధికంగా  ఏడుగురు మరణించారు. చిత్తూరులో 6, కృష్ణాలో 5, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 4, కడపలో 3, పశ్చిమ గోదావరిలో 3, అనంతపురంలో 2, విశాఖలో 2, నెల్లూరు జిల్లాలో ఒకరు చనిపోయారు.