Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 161 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది.  కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, కోడి పందేలు ఈ పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు.

Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 161 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Andhra Pradesh Corona Updates
Follow us

|

Updated on: Jan 17, 2021 | 5:14 PM

Ap Corona Cases: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది.  కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, కోడి పందేలు ఈ పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా 36,091 శాంపిల్స్ టెస్టు చేయగా 161 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కొవిడ్‌ కేసుల సంఖ్య 8,85,985కి చేరింది. కొత్తగా విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందినట్లు  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌‌లో తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ కారణంగా మృత్యువాతపడ్డ వారి సంఖ్య 7,140కి చేరింది. 24 గంటల వ్యవధిలో 251 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 876949కు చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 1,896 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,25,76,272 శాంపిల్స్ టెస్టు చేసినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.

మరోవైపు జనవరి 16న ఏపీలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో తొలి రోజు అత్యధికంగా గుంటూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ వేశారు. గుంటూరు జిల్లాలో 2274 మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 2096 మంది టీకా తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో 2027 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 1802 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో 1655 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి వ్యాక్సిన్‌ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 1616 మందికి టీకాలు వేశాలు. మొత్తంగా ఏపీలో తొలిరోజు మొత్తం 19 వేల 108 మందికి టీకాలు అందించారు.

Also Read:  COVID-19 vaccine: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌ మంచిదే.. భయపడాల్సిన పని లేదన్న ఎయిమ్స్‌ డైరెక్టర్