డ్వాక్రా మహిళలకు శుభవార్త: ఏపీ సర్కార్ ’ఆసరా‘తో అకౌంట్లలో డబ్బు జమ

ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల సభ్యుల బ్యాంకు రుణాలను నేరుగా చెల్లించేందుకు ’వైఎస్ఆర్ ఆసరా‘ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

డ్వాక్రా మహిళలకు శుభవార్త: ఏపీ సర్కార్ ’ఆసరా‘తో అకౌంట్లలో డబ్బు జమ
Follow us

|

Updated on: Sep 11, 2020 | 12:40 PM

ఏపీలో మరో సంక్షేమ పథకం ప్రారంభమైంది. స్వయం సహాయక సంఘాల సభ్యుల బ్యాంకు రుణాలను నేరుగా చెల్లించేందుకు ’వైఎస్ఆర్ ఆసరా‘ పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 87.74 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. వైఎస్ఆర్ పథకం కింద డ్వాక్రా సంఘాల సభ్యుల ఖాతాల్లో రూ. 6,792.20 కోట్లను ప్రభుత్వం జమచేనుంది. అంతేకాదు త్వరలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకం ద్వారా రుణాలను నాలుగు విడతల్లో నేరుగా డ్వాక్రా మహిళలకు అందించనున్నారు. ఈ పథకం కింద 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేశారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని డ్వాక్రా మహిళలకే వదిలేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ప్రభుత్వం ఆదేశించింది.