రేపు వైఎస్ జగన్ మచిలీపట్నంలో పర్యటన… మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పరామర్శ..

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మచిలీపట్నంలో పర్యటించనున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:39 pm, Fri, 20 November 20
రేపు వైఎస్ జగన్ మచిలీపట్నంలో పర్యటన... మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పరామర్శ..

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మచిలీపట్నంలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం వెళ్లనున్నారు. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల మంత్రి పేర్నినాని తల్లి గారు నాగేశ్వరమ్మ(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాని తల్లి నాగేశ్వరమ్మ కొద్ది రోజులు విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఆమె కోలుకోవడంతో రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ గురువారం ఉదయం మరోసారి నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే నాగేశ్వరమ్మ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.