జగన్ సంచలన నిర్ణయం

AP Cm YS Jagan to appoint 5 deputy Cm's In Andhrapradesh, జగన్ సంచలన నిర్ణయం

ఏపీ కేబినెట్ రూపు రేఖలకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీఎల్పీ భేటీ ప్రారంభ ఉపన్యాసం చేసిన జగన్… మంత్రి వర్గ కూర్పుపై కీలక కామెంట్లు చేశారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నట్లు వెల్లడించారు. 25 మంది మంత్రులతో తన కేబినెట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, కాపులకు 50 శాతం మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మంత్రుల్లో 90శాతం మందిని రెండున్నరేళ్ల తర్వాత మార్చి, కొత్తవారికి ఛాన్స్ ఇస్తామని ఆయన ఎమ్మెల్యేలకు వివరించారు. ప్రాంతాల వారీగా పదవుల పంపిణీలో సమతుల్యత పాటించేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.

జగన్ నిర్ణయాలు వెల్లడిస్తున్న తరుణంలో పలువురు ఎమ్మెల్యేలు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలందరికీ అవకాశం కల్పిస్తానని, ఇన్నాళ్లు తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *