Breaking News
  • జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన బల్దియా అధికారులు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశం. ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి - లోకేష్ కుమార్. ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి - లోకేష్ కుమార్. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి - లోకేష్ కుమార్.
  • ఏరియా ఆస్పత్రి కేసీఆర్ కిట్ లలో గోలమాల్. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఘటన పై విచారణ చేపట్టిన వైద్యాధికారులు . డెలివరీల డేటా ఎంట్రీలు చేయకుండా గోల్ మాల్ . ప్రతి కాన్పుకు అబ్బాయికి 11 వేలు అమ్మాయికి 12వేలుతో పాటు కేసీఆర్ కిట్ . బెనిఫిషరీస్ కు రావలసిన మొత్తం లో అవకతవకలను గుర్తించిన డిఎం అండ్ వో కార్యాలయం. 300 డెలివరీ డిటైల్స్ ఎంట్రీ కాకపోవడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు. డేటా ఎంట్రీలు గోల్ మాల్ పై బాధ్యుడిగా గుర్తించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ . డిఎం అండ్ వో కార్యాలయంలో గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం: టీవీ9 తో dm&ho స్వరాజ్యాలక్ష్మి. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్ ను ఆదేశించడంతో అసలు విషయం బయట పడింది: dm&ho. పోలీస్ ల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి: dm&ho.
  • తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలోపల కు విగ్రహాలు తీసుకెళ్లిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన ఎస్పీ రమేష్ రెడ్డి. నిందితులు ముగ్గురూ పుత్తూరుకు చెందినవారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాలహాస్తి అలయంలోపల ఉంచారు. నందీశ్వరుడు, శివుడి విగ్రహాలను తిరుపతిలోనే ఏడు వేలకు కొనుగోలు చేశారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి కాకపోవడం, అప్పుల పాలయిపోవడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఒక స్వామీజీ చెప్పిన సలహాతో ఇలా చేశారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో పెడితే దోషాలు పోయి ..కలిసి వస్తుందని స్వామీజీ చెప్పాడు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నాము.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి: పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాపై ప్రభుత్వం కార్యచరణ. వివిధ జిల్లాల్లోని 21 పట్టణాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు. మొత్తంగా 50 పట్టణాల్లో రూ. 5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు.
  • టివి9 ఎఫెక్ట్.. నోళ్లు తెరుచుకున్న ఓపెన్ డ్రైనేజీ కథనాలపై స్పందించిన జిహెచ్ఎంసీ అధికారులు. మూసాపేట ప్రాంతంలో ప్రమాదకర నాళాలను పరిశీలించిన అధికారులు. ప్రమాదకర నాలాలను పరిశీలిస్తున్నాం..ఇప్పటికి పది కిలోమీటర్లు తనిఖీ చేశాం. ఇప్పటి వరకూ 2కిలోమీటర్ల డేంజర్ డ్రైన్లను గుర్తించాం: టివి9 తో డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఇప్పటికి గుర్తించిన వాటికి ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం: డిప్యూటీ కమిషనర్ రవికుమార్. కబీర్ నగర్ లో 260 మీటర్లు కాలువ మరమ్మతులు , ప్రొటక్షన్ పనులకు ప్రపోజల్స్ పెట్టాం: డిప్యూటీ కమిషనర్. కాలువ పరిస్థితిని బట్టి సైడ్ వాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం: డిప్యూటీ కమిషనర్. ఓపెన్ డ్రైన్ల వద్ద రిటైనింగ్ వాల్ ,సైడ్ వాల్ , ఇతర మరమ్మత్తుల కోసం మరిన్ని ప్రణాళికలు తయారుచేస్తున్నాం: డిప్యూటీ కమిషనర్ రవికుమార్.
  • టీవీ9 చేతిలో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసుల చార్జిషీట్‌. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆర్టీఐకి ఎక్సైజ్‌శాఖ రిప్లై. గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడి. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్‌ దాఖలు-ఎక్సైజ్‌శాఖ. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై సమాచారం ఇవ్వని శాఖ. ఎక్సైజ్‌శాఖ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు.

రేప్ చేసినవాడు ఎవడైనా తోలు తీయండి..సీఎం జగన్ అల్టిమేటం

dachepalli rape case, రేప్ చేసినవాడు ఎవడైనా తోలు తీయండి..సీఎం జగన్ అల్టిమేటం

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనిక్‌ వే లో పాలనను సాగిస్తున్నారు. రివర్స్ టెండరింగ్, పరిశ్రమలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, గ్రామ వాలంటీర్లు లాంటి ప్రొగ్రామ్స్ అమలు దిశగా ముందుకెళ్తూ..దేశంలోనే ఓ నూతన ఒరవడిని క్రియేట్ చేశారు. అంతేకాదు తప్పు చేస్తే సొంతపార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ టోల్రేట్ చెయ్యడం లేదు. అందుకు ఇటీవల జరిగిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టే ప్రత్యక్ష ఉదాహారణ. ఇక మరోవైపు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జగన్ పోలీసులకు స్ట్రిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. తప్పు చేస్తే ఎవ్వర్నీ ఉపేక్షించవద్దని అల్టిమేటం జారీ చేశారు.

తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై.. యువకుడు నరేంద్ర రెడ్డి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారం రోజులుగా చిన్నారి నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడు నరేంద్ర రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారంటూ బాలిక బంధువులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళన విషయం  సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. నిందితులు విషయంలో చర్యలు ఎంతవరకు వచ్చాయని పోలీసు బాస్‌లను ప్రశ్నించారు. తప్పుచేసినవారు ఎంతటివారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ అధికారులు బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోలీస్ రిపోర్ట్ అందగానే బాధిత బాలిక కుటుంబానికి మొదట కొంత ఆర్థిక సహాయం అందుతుందన్నారు. చార్జిషీట్ దాఖలయ్యాక మరికొంత ఆర్థిక సహాయం అందుతుందన్నారు.

Related Tags