మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. ఏపీకి రావాల్సిన నిధులపై వినతిపత్రం

నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం అక్కడికి బయలుదేరి వెళ్లనున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్న జగన్.. అక్కడి గవర్నర్ నరసింహన్‌తో కలిసి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అనంతరం 4.40గంటల నుంచి 5.10గంటల వరకు జగన్ సహా ముఖ్యనేతలతో మోదీ అనధికారికంగా భేటీ అవ్వనున్నారు.

కాగా ఈ భేటీలో ఏపీకి రూ.74,169కోట్లు ఇవ్వాలని ప్రధానికి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు తమకు ఇవ్వాలని ఆ వినతిపత్రం ద్వారా జగన్.. మోదీని కోరనున్నారు. అలాగే 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రధానిగా మోదీ, సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి వారిద్దరి మధ్య భేటీ జరుగుతోన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *