Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

జగన్ మంచి మనసు.. యువతి ప్రాణాలకు భరోసా!

Jagan Shows His Humanity Once Again, జగన్ మంచి మనసు.. యువతి ప్రాణాలకు భరోసా!

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తానెప్పుడూ ప్రజల మనిషినేని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్.. ఎప్పుడు సహాయం కావాలన్నా సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న కూతురుకు ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉన్న తండ్రికి.. నేనున్నానంటూ జగన్ ఆపన్న హస్తం అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై కారు అదుపు తప్పి.. కింద పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువతి తీవ్ర గాయాలపాలై.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. సదరు యువతికి త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పగా.. అందుకోసం ఐదు లక్షలు వెంటనే కట్టాలని యువతి తండ్రికి చెప్పారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ యువతి తండ్రి.. అంత మొత్తంలో డబ్బు కట్టడం అసాధ్యం. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ తండ్రి సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. ఈ వార్త ఎలా వెళ్లిందో గానీ సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వరకు చేరింది. ఆయన వెంటనే ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణను హాస్పిటల్‌కు పంపించి ఆ యువతి వివరాలను సేకరించామన్నారు.

వివరాలు అందగానే  సీఎం వెంటనే స్పందించి.. ఆ యువతి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీజ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా యువతి మాములు స్థితికి వచ్చేవరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా.. ఈ వ్యవహారంలో సహాయపడిన ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి రుణపడి ఉంటామన్నారు.

Related Tags