విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలుః సీఎం జగన్‌

రాష్ట్రంలో కొత్తగా రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు రాష్ట్రంలో విద్యా బోధన సాగాలని అన్నారు.

విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలుః సీఎం జగన్‌
Follow us

|

Updated on: Sep 28, 2020 | 10:07 PM

రాష్ట్రంలో కొత్తగా రెండు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు రాష్ట్రంలో విద్యా బోధన సాగాలని అన్నారు. సోమవారం అమరావతిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా విధానం–2020పై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? కేంద్ర సూచించిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం జగన్.

రాష్ట్రంలోని అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి ఎన్‌ఏసీ,ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలన్నారు సీఎం. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేసి అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు సీఎం జగన్. అలాగే, విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పాలంటే ముందుగా టీచర్‌ ట్రెయినింగ్‌ కాలేజీలపై దృష్టి పెట్టాలన్న సీఎం.. ప్రమాణాలు పాటించని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని.. అయినా వారిలో మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయాలని సూచించారు సీఎం జగన్. బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించి తీరాలి. కాలేజీలలో ప్రమాణాలు, నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ ఖరారు చేసుకోవాలన్నారు.

ఉన్నత విద్యలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులతో పీజీ ప్రోగ్రాములు రూపొందించాలని, అలాగే మూడు,నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు కల్పించేలా ప్రణాళిక తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అటానమస్‌ కాలేజీల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరముందన్న సీఎం.. రొబొటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, డేటా అనలటిక్స్‌ వంటి కొత్త కోర్సులు ప్రారంభించాలని సూచించారు.

జాతీయ అక్రిడిటేషన్‌ సంస్థలతో అనుబంధంగా రాష్ట్రంలో కూడా అక్రిడిటేషన్‌ విభాగాన్ని తయారు చేయాలన్న సీఎం జగన్.. విద్యా సంస్థలను అన్నింటినీ కూడా అక్రిడిటేషన్‌ వైపు నడిపించాలన్నారు. విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలు విజయనగరంలో ఇంజనీరింగ్‌ విద్య ఫోకస్‌గా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా, టీచర్ ఎడ్యుకేషన్‌ ఫోకస్‌గా ఒంగోలు యూనివర్సిటీ, కాలేజీలలో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్న అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. నాణ్యత ప్రమాణాలు పాటించని 200కు పైగా కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపిన అధికారులు.. వారు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని వివరించారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!