ఏపీలో తొలి “దిశ పోలీస్ స్టేషన్” ప్రారంభించిన సీఎం జగన్..

ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఈ దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటలూ ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను […]

ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం జగన్..
Follow us

| Edited By:

Updated on: Feb 08, 2020 | 2:21 PM

ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఈ దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటలూ ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను కూడా ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసుల విషయంలో 14 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21 రోజుల్లోపే శిక్ష ఖరారయ్యేటట్టుగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం జగన్ తెలిపారు. మహిళల రక్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని.. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు.

కాగా.. దిశ వంటి ఘటనల్లో కేసులు నమోదైతే.. రెండు వారల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన సాక్ష్యాధారాలు ఉంటే.. దోషులకు కేసు ఫైల్ అయ్యినప్పటి నుంచీ.. 21 రోజుల్లో శిక్ష అమలు అయ్యేలా ఉంది. అయితే ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే.. ఘటన తీవ్రతను బట్టి.. ఉరిశిక్షకూడా విధిస్తారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..