Breaking News
  • చిత్తూరు: పలమనేరు మండలం మండిపేటలో ఎనుగుల విధ్వంసం. పంటపొలాలపై దాడి, కొబ్బరి చెట్లు ధ్వంసం. పశువులపైనా దాడి చేసిన గజరాజులు. దూడ మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలు. భయాందోళనలో రైతులు.
  • ప.గో: భీమడోలు మండలం పొలసానిపల్లిలో హత్యాయత్నం. భర్తను చంపేందుకు యత్నించిన భార్య. కూరలో సైనైడ్‌ కలిపి భర్తకు వడ్డించిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గురునాథ్‌. భార్య రాణి, కొడుకు సహా మరోముగ్గురిపై కేసు నమోదు.
  • హైదరాబాద్‌: పంజాగుట్టలో దొంగల బీభత్సం. అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళలు. ఓ మహిళపై సుత్తితో దాడి చేసిన దొంగ. మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • సెల్ఫ్‌ డిసిప్లేన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైన్‌లు వేసినంత మాత్రానా మార్పు రాదు. వాహనదారులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. బయోడైవర్సిటీ ప్రమాదం తర్వాత అనేక చర్యలు చేపట్టాం. వాహనదారుల్లో మార్పు రాకుంటే నిర్దిష్ట వేగాన్ని కఠినంగా అమలు చేస్తాం. వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేవారు కూడా నష్టపోతున్నారు -టీవీ9తో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.
  • ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత. రెండు రోజుల క్రితం అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థి మృతదేహం లభ్యం. గోపాలపురం దగ్గర ఎన్‌ఎస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు. మృతదేహంతో కలెక్టరేట్‌ దగ్గర బంధువుల ఆందోళన.
  • అమరావతి: ఐటీ దాడుల పూర్తి పంచనామా రిపోర్ట్‌ విడుదల. భారీగా డైరీలు, రిజిస్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఐటీశాఖ. కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్‌. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన లాకర్లు సీజ్‌ చేసినట్టు పంచనామాలో వెల్లడి.

ఇఫ్తార్ విందులో జగన్..ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ

AP CM YS JAGAN Hosts Iftar Dinner In Guntur, ఇఫ్తార్ విందులో జగన్..ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ

గుంటూరు: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల ద్వారా దేవుడు అద్భుతమైన ఫలితం ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్‌ దాటవేత ధోరణితో వ్యవహరించారు. 9 మంది వైఎస్సార్‌ సీపీ ఎంపీలు గెలిస్తే ముగ్గురుని ఇదే మాదిరిగా లాక్కున్నారు. మే 23న రంజాన్‌ మాసంలోనే ఫలితాలు వచ్చాయి. టీడీపీ గెలిచింది కూడా 23 స్థానాల్లో మాత్రమే. అలాగే టీడీపీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. దేవుడు స్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలకు మించిన ఊదాహరణ ఏముంటుంది?. నేను ఈ రంజాన్‌ మాసంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను. నాన్న గారి తరహాలోనే మీ అందరికి మేలు చేస్తాను. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలున్నారు. ఈ ఎన్నికల్లో ఐదుగురికి టికెట్‌ ఇస్తే.. నలుగురు గెలుపొందారు. హిందూపురంలో ఓడిపోయిన ఇక్బాల్‌ను కూడా త్వరలోనే ఎమ్మెల్సీగా చేస్తామ’ని తెలిపారు.

Related Tags