Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్

CM YS Jagan are allocated Departments to Cabinet Ministers, మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది… సీఎం జగన్ టీమ్‌కు చెందిన 25 మంత్రులతో వెలగపూడిలోని సచివాయలంలో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపె విశ్వరూప్‌, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, అంజద్‌ బాషా, యం. శంకరనారాయణ ప్రమాణం చేయగా… ఇప్పుడు తాజాగా వారికి శాఖలు కేటాయించారు.

1. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి: గనుల శాఖ, పంజాయతీరాజ్ శాఖ
2. మేకతోటి సుచరిత: హోంశాఖ (డిఫ్యూటీ సీఎం)
3. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థికశాఖ, శాసనసభా వ్యవహారాలు
4. తానేటి వనిత: మహిళా, స్త్రీ సంక్షేమశాఖ
5. కె.నారాయణస్వామి:  ఎక్సైజ్ శాఖ (డిఫ్యూటి సీఎం)
6. పాముల పుష్ప శ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
7. పిల్లి సుభాష్ చంద్రబోస్: రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ (డిప్యూటీ సీఎం)
8. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి : పర్యావరణం, అటవీ శాఖ
9. కొడాలి నాని: పౌరసరఫరాలశాఖ
10. ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
11. ధర్మాన కృష్ణదాస్ : రోడ్లు, భవనాలు
12.బొత్స సత్యనారాయణ : మున్సిపల్ శాఖ
13. విశ్వరూప్ : సాంఘీక సంక్షేమ శాఖ
14. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ
15. రంగనాథరాజు : గృహ నిర్మాణం
16. ఆళ్ల నాని : వైద్య, ఆరోగ్య శాఖ (డిప్యూటీ సీఎం)
17. అనిల్ కుమార్ యాదవ్ : ఇరిగేషన్ శాఖ
18. పేర్ని నాని : రవాణా, సమాచార శాఖ
19. వెల్లంపల్లి శ్రీనివాస్ : దేవాదాయ శాఖ
20. మోపిదేవి వెంకటరమణ : పశు సంవర్థక, మత్స్య శాఖ
21. గుమ్మనూరు జయరాం : కార్మిక, ఉపాది శాఖ
22. మేకపాటి గౌతంరెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ
23. ఆదిమూలపు సురేష్ : విద్యా శాఖ
24. అవంతి శ్రీనివాస్ : పర్యాటకం, యువజన సర్వీసులు
25. శంకర్ నారాయణ : బీసీ సంక్షేమం