Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

ఏపీ సీఎం జగన్ స్పీచ్: కీ పాయింట్స్..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలను అందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన.. భారీ బహిరంగ సభలో జగన్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే.. భారీ ఎత్తున యువత కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా.. జిల్లాల వారీగా.. అర్హులకు అపాయింట్‌ మెంట్ లెటర్స్‌ ఇవ్వనున్నారు ఏపీ ఇన్‌ఛార్జ్ మంత్రులు.

జగన్ స్పీచ్ హైలెట్స్:

1. ఉద్యోగాల చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్ అని అన్నారు.
2. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు.
3. దాదాపు లక్షన్నర మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు సీఎం.
4. నిజాయితీగా, లంచాలు లేని, పారదర్శక పాలన అందజేయాలని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సూచించారు.
5. వాలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు అనుసంధానం కావాలని.. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలి
6. అవినీతి లేని పాలన కోసం ప్రజలందరూ చూస్తున్నారని.. ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగుల భుజాలపై పెడుతున్నా
7. నా నమ్మకాన్ని ఎవరూ వమ్ము చెయొద్దు
8. ఇది ఒక ఉద్యోగంలా కాకుండా.. ఉద్యమంలా పని చేయండి.
9. 72 గంటల్లో ఫిర్యాదులను పరిష్కరించడమే మీ లక్ష్యం
10. మొత్తం 19 రకాల ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక
11. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు
12. ప్రతీ గ్రామ వాలంటీర్‌కు ఒక స్మార్ట్ ఫోన్
13. 34డిపార్టు మెంట్లకు సంబంధించి పనులు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతాయి
14. గ్రామ సచివాలయాల్లో డిసెంబర్ తొలి వారం కల్లా కంప్యూటర్లు, సహా ఇతరత్రా పరికరాలు, ఫర్నీచర్ పూర్తిగా అందుబాటులోకి తెస్తాం
15. జనవరి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ పథకాలన్నీ గ్రామ సచివాలయం పరిధిలోకి వస్తాయి
16. ఫిర్యాదుల కోసం సీఎం పేషిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం
17. ఉద్యోగాలు రానివారెవరూ నిరాశచెందవద్దు
18. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతాo
19. ఉద్యోగాలు సాధించిన 1లక్ష 35 వేల మంది అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు
20. జనవరి 1 నుంచి గ్రామాల్లో 500ల సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు సీఎం జగన్.