బ్రేకింగ్ : రేపు పోలవరంకు ఏపీ సీఎం..!

ఏపీ సీఎం జగన్ తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గురువారం ప్రాజెక్టు పురోగతి, పనులను పరిశీలించేందుకు పోలవరం వెళ్లబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, ఎస్పీ పరిశీలించారు. ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్‌కు చేరుకొని, హెలీప్యాడ్‌తో పాటు అక్కడినుంచి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా.. సీఎం జగన్ ప్రాజెక్టు వద్ద దాదాపు 3 గంటల సేపు ఉండనున్నారని సమాచారం. సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ […]

బ్రేకింగ్ : రేపు పోలవరంకు ఏపీ సీఎం..!
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 10:31 AM

ఏపీ సీఎం జగన్ తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గురువారం ప్రాజెక్టు పురోగతి, పనులను పరిశీలించేందుకు పోలవరం వెళ్లబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, ఎస్పీ పరిశీలించారు. ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్‌కు చేరుకొని, హెలీప్యాడ్‌తో పాటు అక్కడినుంచి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా.. సీఎం జగన్ ప్రాజెక్టు వద్ద దాదాపు 3 గంటల సేపు ఉండనున్నారని సమాచారం. సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పోలవరం అథారిటీ కమిటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు వస్తున్నందున ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయనున్నారు.