జగన్ మార్క్ సంక్షేమం.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు జమ..

'జగనన్న చేదోడు' పధకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పధకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం ఇవ్వనుండగా..

జగన్ మార్క్ సంక్షేమం.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు జమ..
Follow us

|

Updated on: Jun 10, 2020 | 7:33 AM

ఒకవైపు కరోనా వైరస్.. మరో వైపు ఆర్ధిక సంక్షోభం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నా.. జగన్ సర్కార్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. వరుసగా పేదవారి కోసం సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ‘జగనన్న చేదోడు’ పధకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

ఈ పధకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం ఇవ్వనుండగా.. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానుంది. తొలి విడతగా 2,47,040 మంది లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. వీరిలో టైలర్లు 1,25,926 మంది, రజకులు 82,347 మంది, నాయీ బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరందరికీ కూడా జగనన్న చేదోడు పధకం కింద రూ. 247 కోట్లు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి.

జిల్లాల వారీగా లిస్ట్ ఇలా ఉంది…

  • శ్రీకాకుళం- టైలర్లు(5,184), రజకులు(7,187), నాయీ బ్రాహ్మణులు(3,355)
  • విజయనగరం- టైలర్లు(8,669), రజకులు(6,931), నాయీ బ్రాహ్మణులు(2,893)
  • విశాఖపట్నం- టైలర్లు(11,195), రజకులు(8,319), నాయీ బ్రాహ్మణులు(3,414)
  • తూర్పుగోదావరి- టైలర్లు(13,235), రజకులు(7,773), నాయీ బ్రాహ్మణులు(4,085)
  • పశ్చిమ గోదావరి- టైలర్లు(10,617), రజకులు(7,214), నాయీ బ్రాహ్మణులు(3,295)
  • కృష్ణా- టైలర్లు(16,656), రజకులు(4,366), నాయీ బ్రాహ్మణులు(3,116)
  • గుంటూరు- టైలర్లు(11,764), రజకులు(2,786), నాయీ బ్రాహ్మణులు(3,030)
  • ప్రకాశం- టైలర్లు(10,472), రజకులు(3,351), నాయీ బ్రాహ్మణులు(2,114)
  • నెల్లూరు- టైలర్లు(9,688), రజకులు(4,902), నాయీ బ్రాహ్మణులు(1,534)
  • వైఎస్సార్- టైలర్లు(5,739), రజకులు(7,399), నాయీ బ్రాహ్మణులు(1,980)
  • కర్నూలు- టైలర్లు(8,863), రజకులు(8,768), నాయీ బ్రాహ్మణులు(4,108)
  • చిత్తూరు- టైలర్లు(9,565), రజకులు(3,934), నాయీ బ్రాహ్మణులు(1,992)
  • అనంతపురం- టైలర్లు(4,279), రజకులు(9,417), నాయీ బ్రాహ్మణులు(3,851)

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!