గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీలపై సీఎం జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీలపై సీఎం జగన్‌ సమీక్ష
Follow us

|

Updated on: Aug 14, 2020 | 9:30 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

ఇప్పటికే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రణాళిక బద్ధంగా పంటసాగును నిర్ధారించాలని ఆదేశించిన సీఎం జగన్.. పంట దిగుబడికి కావల్సిన మార్కెటింగ్ వసతులపై కూడా దృష్టి సారించారు. రైతులు పండించే పంటపై ఇ–క్రాపింగ్‌ కోసం విధివిధానాలను రూపొందిస్తున్నారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇ–ప్లాట్‌ఫాంను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే సీజన్‌లో ఏర్పాటు చేయదలచిన జనతా బజార్లకూ గ్రేడింగ్, ప్యాకింగ్‌ విధానాలు దోహద పడతాయి. తర్వాత దశలో గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు కావాలి. శుక్రవారం జరగే సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అధికారులు వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని, ఈ మేరకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించే పనిలో పడ్డారు.