నేడు సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్.. తీర్పు పై సస్పెన్స్..

ఏపీ సీఎం జగన్‌ ఈరోజు హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్‌కి వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ పై నేడు (శుక్రవారం) సీబీఐ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. గతంలో కూడా ఇదే పిటిషన్ వేయగా జగన్ కు వ్యక్తిగత హాజరు ఇవ్వలేమంటూ కోర్టు చెప్పింది. అయితే గతంలో పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరని.. జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అంతేకాదు […]

నేడు సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్.. తీర్పు పై సస్పెన్స్..
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 12:39 PM

ఏపీ సీఎం జగన్‌ ఈరోజు హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్‌కి వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ పై నేడు (శుక్రవారం) సీబీఐ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. గతంలో కూడా ఇదే పిటిషన్ వేయగా జగన్ కు వ్యక్తిగత హాజరు ఇవ్వలేమంటూ కోర్టు చెప్పింది. అయితే గతంలో పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరని.. జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అంతేకాదు సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతో నిమగ్నమై ఉంటారని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం వల్ల.. పరిపాలనతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ గతంలో జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

గతంలో అరెస్టై జైలులో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అప్పట్లో ఆయన కేవలం ఎంపీ మాత్రమేనని, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ రెండు పక్షాలూ కోర్టులో బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.