బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:25 pm, Wed, 21 October 20

విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా వేడుకలు ఘనం ప్రారంభమయ్యాయి. బుధవారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజు కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఘాట్‌ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు పాలకమండలి ఛైర్మన్‌ పైలా స్వామినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు. కొండచరియలు పడకుండా తీసుకోవల్సిన జాగ్రతలను అధికారులకు సూచించారు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు.