జనవరికల్లా కరోనా వ్యాక్సిన్!.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమన్నారు.

జనవరికల్లా కరోనా వ్యాక్సిన్!.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Sep 29, 2020 | 5:43 PM

కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమన్నారు. పాజిటివిటీ రేట్‌ 12.0 నుంచి 8.3కి తగ్గిందన్నారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. కరోనా నివారణ చర్యలపై మంగళవారం సమీక్షించారు సీఎం. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.

జనవరికల్లా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం కనిపిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కోవిడ్‌ ఆస్పత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఎంప్యానల్‌ ఆస్పత్రుల లిస్టు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. 104 నంబర్‌కు ఫోన్‌ కొట్టిన వెంటనే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలని సీఎం జగన్ అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలని.. ప్రతిరోజూ మానిటర్‌ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.

హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్