ముఖ్య నేతలతో జగన్ భేటీ.. అందుకేనా!

రేపటి ఏపీ కేబినెట్‌, అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ అంశాలపై ప్రభుత్వం వ్యూహరచనలో నిమగ్నమైంది. తాడేపల్లి నివాసంలో.. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శాసనమండలి విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, మండలిలో ప్రభుత్వ వ్యూహాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశాన్ని లోకాయుక్తకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా క్యాబినెట్ అజెండా, అసెంబ్లీ బిల్లులు అత్యంత గోప్యంగా […]

ముఖ్య నేతలతో జగన్ భేటీ.. అందుకేనా!
Follow us

| Edited By:

Updated on: Jan 19, 2020 | 2:17 PM

రేపటి ఏపీ కేబినెట్‌, అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ అంశాలపై ప్రభుత్వం వ్యూహరచనలో నిమగ్నమైంది. తాడేపల్లి నివాసంలో.. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శాసనమండలి విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, మండలిలో ప్రభుత్వ వ్యూహాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశాన్ని లోకాయుక్తకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా క్యాబినెట్ అజెండా, అసెంబ్లీ బిల్లులు అత్యంత గోప్యంగా తయారవుతున్నట్లు సమాచారం. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఆయన.. సీనియర్ మంత్రులతో మాత్రమే చర్చిస్తున్నారు.