జగన్ మరో సంచలన నిర్ణయం.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు క్యాంప్ కార్యాలయంలో 'నాడు-నేడు'పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా విద్యాశాఖకు సంబంధించి చర్చలు జరిపారు అధికారులు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల బదిలీ అంశం...

జగన్ మరో సంచలన నిర్ణయం.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 4:02 PM

ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేడు క్యాంప్ కార్యాలయంలో ‘నాడు-నేడు’పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా విద్యాశాఖకు సంబంధించి చర్చలు జరిపారు అధికారులు. ఈ క్రమంలో ఉపాధ్యాయుల బదిలీ అంశం చర్చకు వచ్చింది. దీంతో టీచర్ల బదీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. 10వ తరగతి పరీక్షలు తరువాత జులై మూడో వారంలో టీచర్‌ల బదిలీలు చేపట్టడానికి సీఎం అనుమతిచ్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

కాగా ప్రస్తుతం ఏపీలో క‌రోనా క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్‌ను టెస్ట్ చేయ‌గా 79 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. ఇవికాక‌ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది.. విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కోవిడ్-19 నిర్థారణ అయ్యింది. ఇవి కూడా లెక్క‌గ‌డితే 24 గంట‌ల్లో 180 కేసులు న‌మోద‌యిన‌ట్లు అవుతుంది. ఇక‌ ఇప్పటివరకు మొత్తం 3279 కోవిడ్-19 కేసులు న‌మోద‌య్యాయి. కాగా రాష్ట్రంలో క‌రోనాతో మొత్తం 68 మంది మృతి చెందారు. వ్యాధి న‌య‌మై వివిధ ఆస్ప‌త్రులు నుంచి 2244మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య‌ 967గా ఉంది.

Read More:

సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబ్ బెదిరింపులు..

జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి