అన్నదాతకు అండగా అగ్రిమిషన్: ఏపీ సీఎం జగన్

అన్నదాతకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎండనకా..వాననకా కష్టపడి పంటలు పండించే రైతుకు సీఎం జగన్ నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన వ్యవసాయ మిషన్ ( అగ్రిమిషన్) తొలి సమావేశాన్ని నిర్వహించారు. అగ్రిమిషన్ ఛైర్మన్ హోదాలో సీఎం జగన్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా సభ్యుల సూచనలు, సలహాలను ఆయన విన్నారు. ఈ మిషన్ ద్వారా వైఎస్సార్ రైతు భరోసాలో […]

అన్నదాతకు అండగా అగ్రిమిషన్:  ఏపీ  సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 12:36 PM

అన్నదాతకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎండనకా..వాననకా కష్టపడి పంటలు పండించే రైతుకు సీఎం జగన్ నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన వ్యవసాయ మిషన్ ( అగ్రిమిషన్) తొలి సమావేశాన్ని నిర్వహించారు. అగ్రిమిషన్ ఛైర్మన్ హోదాలో సీఎం జగన్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా సభ్యుల సూచనలు, సలహాలను ఆయన విన్నారు. ఈ మిషన్ ద్వారా వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా ప్రకటించిన ప్రతి పథకాన్ని రైతుకు అందజేయడమే దీని ఉద్దేశమన్నారు. దీనికోసం రూ. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని కూడా రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు.

మఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రణాళికా లోపంతోనే పలు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షోభంగా మారిన విత్తనాల కొరత దీనికి కారణమన్నారు. ముందస్తు చర్యలతో వ్యవసాయ రంగ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చన్నారు. రాష్ట్రలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయే పరిస్థితి రాకూడదని , విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ వంటివి పూర్తిస్దాయిలో తనిఖీ చేసిన తర్వాతే మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు.

అదే విధంగా రైతులకు ఇస్తున్న కరెంటు విషయంపై కూడా చర్చించారు. వ్యవసాయదారులకు విద్యుత్ అందించడంలో అలసత్వం వహించవద్దని వారికి నాణ్యమైన కరెంటును అందించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఏడు అంశాలపై సీఎం జగన్ చర్చించారు. మరోవైపు ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ రైతు దినోత్సవంగా జరగనున్న జూలై 8 నుంచి అమల్లోకి రానున్నాయి.