ఏపీ ఐపీఎస్‌ల అధికారుల బదిలీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఏపీ ఐపీఎస్‌లను బదిలీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలపై న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల డ్యూటీతో సంబంధం లేని అధికారులను.. బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని అన్నారు. వైసీపీ, బీజేపీ కుమ్మక్కై బదిలీలు చేపించారని విమర్శించారు. నిఘా అధికారులను బదిలీ చేయడం ఏపీపై కక్ష సాధింపు చర్య అని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును […]

ఏపీ ఐపీఎస్‌ల అధికారుల బదిలీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 10:55 AM

టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ఏపీ ఐపీఎస్‌లను బదిలీలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలపై న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల డ్యూటీతో సంబంధం లేని అధికారులను.. బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని అన్నారు. వైసీపీ, బీజేపీ కుమ్మక్కై బదిలీలు చేపించారని విమర్శించారు. నిఘా అధికారులను బదిలీ చేయడం ఏపీపై కక్ష సాధింపు చర్య అని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరన్నారు.

అలాగే.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికే కేసీఆర్ కొర్రీలు వేస్తున్నారు. కొర్రీలతో పోలవరం పనులను అడ్డుకోలేరని అన్నారు. ప్రజల్లోకి టీడీపీ పథకాలను పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని అన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ఓట్ల తొలగింపు కుట్రలు చేసే ప్రయత్నం ఉందని.. టీడీపీ నేతలందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు సీఎం చంద్రబాబు.