Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

రాజధాని రైతులపై జగన్ సర్కార్ వరాల జల్లు!

AP Capitals Issue Finalized, రాజధాని రైతులపై జగన్ సర్కార్ వరాల జల్లు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెడితే.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో వ్యవసాయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చకు తీసుకొచ్చారు. ఇక ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు కమిటీలను(బోస్టన్, హైపవర్) వేసి అధ్యయనం చేశామని.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టిందని ఆరోపించారు. హైపవర్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చిందని దానికి అనుగుణంగా 13 జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం రాజధాని రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగిస్తామన్నారు. 28 వేల మంది రైతులు సుమారు 34 వేల ఎకరాలను ఇచ్చారని అందరికీ కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చేస్తామని అన్నారు. ఇకపోతే రైతులకు ఇచ్చే రూ.2500 పెన్షన్‌ను రూ.5వేలకు పెంచుతున్నామని తెలిపారు. అటు భూముల ఇచ్చిన రైతులకు 15 ఏళ్ళ వరకు కౌలు ఇస్తామని.. పట్టా భూములిచ్చిన రైతులకు 1000 గజాల నివాస స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

 

 

 

Related Tags