వైజాగ్‌లో కేబినెట్ భేటీ..జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!

ఏపీలో ప్రజంట్ పాలిటిక్స్ మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయంలో అధికార పక్షం దూకుడుగా వ్యవహరిస్తూ ఉండగా, విపక్ష పార్టీల్లో మాత్రం డబుల్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనతోనే క్లారిటీ వచ్చినా..జీఎన్ రావు కమిటీ నివేదికతో విషయం పూర్తిగా తేటతెల్లమైంది. ఇక సదరు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుందని మంత్రి బొత్స ప్రకటించారు. మూడు రాజధానుల విషయంలో జగన్ తన మార్క్ డెషీసన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ […]

వైజాగ్‌లో కేబినెట్ భేటీ..జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 24, 2019 | 4:02 PM

ఏపీలో ప్రజంట్ పాలిటిక్స్ మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయంలో అధికార పక్షం దూకుడుగా వ్యవహరిస్తూ ఉండగా, విపక్ష పార్టీల్లో మాత్రం డబుల్ స్టాండ్స్ కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనతోనే క్లారిటీ వచ్చినా..జీఎన్ రావు కమిటీ నివేదికతో విషయం పూర్తిగా తేటతెల్లమైంది. ఇక సదరు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుందని మంత్రి బొత్స ప్రకటించారు.

మూడు రాజధానుల విషయంలో జగన్ తన మార్క్ డెషీసన్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 27న జరగనున్న మంత్రి మండలి భేటీని విశాఖలో నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. భేటీకి సంబంధించి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సహాని ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. వైజాగ్‌లో కేబినెట్ భేటీని నిర్వహించడం ద్వారా జగన్ అటు టీడీపీకి చెక్ పెట్టడంతో పాటు, ఇటు అమరావతి రైతుల సెగ కూడా తగలకుండా జాగ్రత్త పడనున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఇప్పటికే జగన్ ప్రకటనకు మద్దతిస్తోన్న నేపథ్యంలో వారు ఆందోళనలు చేసే అవకాశం లేదు.  మరోవైపు కేబినెట్ సమావేశం అనంతరం ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ విశాఖ అని తుది ప్రకటన చేయనున్న నేపథ్యంలో వైజాగ్ ప్రజలకు..అక్కడ్నంచే గుడ్ న్యూస్ చెప్పినట్లు అవుతుంది. కాగా సీఎం అనుకున్నవి..అనుకున్నట్లు జరిగితే మరో 6 నెలల నుంచి సంవత్సరం మధ్యకాలంలో సచివాలయం విశాఖకు తరలిపోయే అవకాశం కనిపిస్తోంది.