Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

ఇసుక కట్టడికి యాక్షన్ ప్లాన్.. జగన్ సర్కార్ డెసిషన్ ఇదే !

ap cabinet crucial decisions, ఇసుక కట్టడికి యాక్షన్ ప్లాన్.. జగన్ సర్కార్ డెసిషన్ ఇదే !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు అవసరమని కేబినెట్ భావించింది. అందుకు అనుగుణంగా పలు నిర్ణయాలను తీసుకుంది. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎవరైనా లెక్కాపత్రం లేకుండా ఇసుకను తరలిస్తే రెండేళ్లు జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇటు మొక్కజొన్న ధరలు పడిపోవడంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. బుధవారం జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే :

* ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్‌ ఆమోదం

* అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా

* ఇంగ్లీష్‌ మీడియం బోధనకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

* ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలొ బోధన

* మాతృభాష తప్పనిసరిగా ఉంటుంది

* తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా చదవాలి

* మొక్క జొన్నకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం

* అందుబాటులో ప్రతిరోజూ రెండు లక్షల టన్నుల ఇసుక

* పదిరోజుల్లో అవసరానికి తగ్గట్టుగా సరఫరా చేయాలని నిర్ణయం

* పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రణాళిక

* పారిశ్రామిక వ్యర్థాలపై ఆడిట్‌ నిర్వహణ

* ఏపీ పర్యావరణ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు