కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ.. ఉ.11.00 గంటలకు అసెంబ్లీ..

నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మూడురాజధానుల అంశంతో పాటు.. పలుకీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఉదయం 9 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే రిపోర్టు, దీంతో పాటుగా.. అంతకు ముందే వచ్చిన జీఎన్‌‌రావు కమిటీ రిపోర్టు, బీసీజీ రిపోర్టులపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు.మూడు రాజధానుల అంశంపై హై పవర్‌ కమిటీ […]

కాసేపట్లో ఏపీ కేబినెట్‌ భేటీ.. ఉ.11.00 గంటలకు అసెంబ్లీ..
Follow us

| Edited By:

Updated on: Jan 20, 2020 | 7:13 AM

నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మూడురాజధానుల అంశంతో పాటు.. పలుకీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ముందుగా ఉదయం 9 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మూడు రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే రిపోర్టు, దీంతో పాటుగా.. అంతకు ముందే వచ్చిన జీఎన్‌‌రావు కమిటీ రిపోర్టు, బీసీజీ రిపోర్టులపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు.మూడు రాజధానుల అంశంపై హై పవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే CRDA చట్టం రద్దుతో పాటు.. CRDA బాధ్యతల్ని విజయవాడ – గుంటూరు – మంగళగిరి – తెనాలి (VGMT) పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించే బిల్లుల్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఇక వికేంద్రీకరణ, రైతుల సమస్యలపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఉదయం 10 గంటలకు బిఏసీ సమావేశం అనంతరం..11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది.

అయితే ఈ సమావేశంలో రాజధాని తరలింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో… ఎలాగైనా దీనిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఛలో అసెంబ్లీకి పిలుపును కూడా ఇచ్చింది. దీంతో అమరావతి ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా.. ఆ ప్రాంతంలో భారీఎత్తున బలగాలను మొహరించారు. అమరావతి రాజధాని గ్రామాలన్నీ పోలీసుల వలయంలోనే ఉన్నాయి. రైతులు నిసనలను ఉధృతం చేస్తున్న తరుణంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన నివాసం నుంచి సచివాలయం వరకు కనీవినీ ఎరుగని బందోబస్తును పెట్టారు. అసెంబ్లీ చుట్టూ మూడంచెల భద్రతనుతో పాటు సెక్షన్‌ 144, 30 యాక్ట్‌లను అమలు చేస్తున్నారు.