Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

మా పార్టీనే టార్గెట్ చేస్తారా? జగన్‌పై బిజెపి ఆగ్రహం!

bjp leaders angry on ycp, మా పార్టీనే టార్గెట్ చేస్తారా? జగన్‌పై బిజెపి ఆగ్రహం!

ఇద్దరం కలిసి తెలుగుదేశం పని పడదామనుకుంటే.. మమ్మల్నే టచ్ చేస్తారా? అంటూ వైసీపీ నేతలపై మండిపడుతున్నారు కమలనాథులు. తెలుగుదేశం పార్టీని చెరో వైపు వీక్ చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెడితే.. దాన్ని మాపై ప్రయోగిస్తారా అంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నేతలను ఉపేక్షిస్తే తమ యాక్షన్ ప్లాన్ దెబ్బతింటుందని తమ అధిష్టానానికి నివేదించేందుకు రెడీ అవుతున్నారు ఏపీ బిజెపి నేతలు.

ఉమ్మడి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు గత ఆరు నెలలుగా వైసీపీ ఒకవైపు, బిజెపి మరోవైపు చాపకింద నీరులా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు టిడిపి నేతలతో వైసీపీ, బిజెపి నేతలు వేరువేరుగా భేటీలు నిర్వహిస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కొందరు టిడిపి నేతలు వైసీపీ వైపు చేరిపోయారు. వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలు పేరుకు తటస్థులుగా మారినా.. లోపాయికారిగా వైసీపీతో అంట కాగుతున్నట్లే భావించాలి.

ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి బిజెపికి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులను, కుమారుడిని తమవైపునకు లాక్కొంది వైసీపీ. ఒక్క గంగరాజు ఒక్కరే ఇప్పుడు బిజెపిలో మిగలగా.. మొత్తం గోకరాజు ఫ్యామిలీ వైసీపీ గూటికి చేరిపోయింది. ఈ పరిణామంతో బిజెపి ఖంగుతినగా.. వైసీపీ నేతలు విజయగర్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆగ్రహించిన ఏపీ బిజెపి నేతలు.. టార్గెట్ టిడిపి కాదు.. ముందు టార్గెట్ వైసీపీని ప్రారంభించాలని తమ అధిష్టానానికి నివేదించారట.

నిజానికి గత పదిహేను రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో బిజెపి అధినాయకత్వంతో తరచూ భేటీ అవుతున్నారు. ఆయన పార్టీ మారకపోయినా.. తరచూ కేంద్ర మంత్రులను, బిజెపి అగ్ర నేతలను కలిసి పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఢిల్లీలో భారీ విందును ఏర్పాటు చేశారు రఘురామకృష్ణంరాజు. ఈ నేపథ్యంలోనే వైసీపీపై అవలంభించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు రెడీ అవుతున్నారు ఏపీ బిజెపి నేతలు.

మొత్తానికి ఉమ్మడి ప్రత్యర్థిని పక్కన పెట్టి పరస్పరం వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుకునే పనిలో పడ్డాయి వైసీపీ, బిజెపి పార్టీలు. స్వప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే రాజకీయ నేతలు పెరిగిపోయిన తరుణంలో బిజెపి-వైసీపీల పరస్పరం వ్యూహాలు ఏ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.