రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు: సోము వీర్రాజు

రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రాలు రాజధాని కట్టే విషయంలో ఇప్పటివరకు కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదని తెలిపారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:24 am, Fri, 31 July 20

Somu Veerraju on 3 Capitals: రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రాలు రాజధాని కట్టే విషయంలో ఇప్పటివరకు కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదని తెలిపారు. బాబు హయంలో సింగపూర్ తరహా రాజధాని అంటూ హంగామా చేశారని, అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు మూడు రాజధానుల అంశంలోనూ అదే వైఖరి అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఏపీ మూడు రాజధానుల అంశంపై బీజేపీలోని పలువురు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా, మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి సైతం ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

Read This Story Also: పవన్​-క్రిష్ మూవీలో హీరోయిన్​గా రకుల్ ?