జగన్‌వి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు : కన్నా

Kanna Lakshmi Naryana

వైసీపీ ప్రభుత్వానికి ఆత్రం తప్ప పనిలో శ్రద్ధ లేదని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అనవసరమైన విషయాల్లో అత్యుత్సాహం చూపే జగన్‌.. ఇసుక విధానం విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని కన్నా ప్రశ్నించారు. ఏపీలో టీడీపీతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *