కొత్త ఇండియా మ్యాప్: అనాధగా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబే కారణమట..

జమ్మూకాశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఏపీకి రాజధాని లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ..  చంద్రబాబే దానికి కారణమన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులను ఐదు సంవత్సరాలు రాజధాని పేరుతో మోసం చేసి.. చివరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా తీరని ద్రోహం చేశారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. […]

  • Ravi Kiran
  • Publish Date - 2:26 am, Mon, 4 November 19
కొత్త ఇండియా మ్యాప్: అనాధగా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబే కారణమట..

జమ్మూకాశ్మీర్, లఢక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్‌లో ఏపీకి రాజధాని లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ..  చంద్రబాబే దానికి కారణమన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులను ఐదు సంవత్సరాలు రాజధాని పేరుతో మోసం చేసి.. చివరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా తీరని ద్రోహం చేశారంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఇకపోతే కొత్తగా కేంద్రం రిలీజ్ చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్‌లో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజధానులను సూచించిన కేంద్రం.. ఏపీకి మాత్రం అమరావతిని చూపించకపోవడంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పొచ్చు. అంతేకాకుండా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.