ఏపీ : బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతభత్యాలు ఖరారు

బీసీ కులాల సంక్షేమ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతాలు, అలవెన్సులను జగన్ సర్కార్ ఫిక్స్  చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్​కు రూ.56 వేలు,

ఏపీ : బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతభత్యాలు ఖరారు
Follow us

|

Updated on: Nov 02, 2020 | 11:17 PM

బీసీ కులాల సంక్షేమ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతాలు, అలవెన్సులను జగన్ సర్కార్ ఫిక్స్  చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్​కు రూ.56 వేలు, డైరెక్టర్​కు రూ. 12వేలు చెల్లించాలని నిర్ణయించింది. మొత్తంగా ఒక్కో బీసీ కులం కార్పొరేషన్​కు రూ. 2.12 లక్షలు కేటాయించనుంది. ఈ మొత్తంతోనే కార్యాలయం వసతి, ఇతర ఖర్చులు భరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 1 నుంచి ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్​ల జీతాలు ఖరారు…

ప్రాఫిట్ మేకింగ్‌ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లకు జీతాలు, అలవెన్సులను కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ప్రాఫిట్ మేకింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు రూ.65 వేల జీతం, డైరెక్టర్‌కు రూ.14 వేల జీతం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో ప్రాఫిట్ మేకింగ్‌ కార్పొరేషన్‌కు ఖర్చుల కోసం రూ.2.56 లక్షలు కేటాయించనుంది. ఈ నెల 1 నుంచి ఉత్తర్వులు అమలవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Also Read :

Breaking: టీచర్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు నిలిపివేత

పోలీసుశాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్