ఈనెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 5:26 pm, Thu, 26 November 20
ఈనెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5వ విడత ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నవంబర్ 30న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఓ ప్రకటలో తెలిపారు. మొదటిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. బీఏసీలో సమావేశాల నిర్వహణతో పాటు చర్చించే అంశాలపై స్పష్టత రానుంది.