ఆళ్ల రాక్స్..లోకేష్ షాక్స్..మంగళగిరిలో వైసీపీ విజయం

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్… గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి […]

ఆళ్ల రాక్స్..లోకేష్ షాక్స్..మంగళగిరిలో వైసీపీ విజయం
Follow us

|

Updated on: May 23, 2019 | 8:31 PM

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఏపీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఓటమిని చవి చూశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ గెలుపొందారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్… గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేశ్‌కు ఓటమి తప్పలేదు. మొదట ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించిన లోకేష్… ఆ తరువాత ఆధిక్యం విషయంలో వెనుకబడుతూ వచ్చారు.

ఆర్కేకు వ్యక్తిగతంగా మంచి పేరుంది. అధికారంలో లేకపోయినా తన స్థొమతకు తగ్గట్టు ఆయన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేయడంతో పాటు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మంత్రి నారా లోకేశ్ గెలుపు కోసం భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ స్థానంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే అంశంపై గత 40 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఏపీలో లోకేష్ విజయావకాశాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ చివరకు ఈ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆర్కేను గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తానని మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో జగన్ హామీ ఇవ్వడంతో… ఇక ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్