‘త్వరలోనే అంతర్రాష్ట్ర సర్వీసులు’..

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. అన్ లాక్ 4.0 నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కేంద్రం అనుమతించడంతో..

'త్వరలోనే అంతర్రాష్ట్ర సర్వీసులు'..
Follow us

|

Updated on: Sep 13, 2020 | 8:08 PM

AP And Telangana Inter State Services: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. అన్ లాక్ 4.0 నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కేంద్రం అనుమతించడంతో.. వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే అవి మాత్రం ఇంకా కొలిక్కి రావట్లేదు. ఇక తాజాగా దీనిపై ఏపీ రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు స్పందించారు. మంగళవారం ఇరు రాష్ట్రాల ఎండీలు చర్చలు జరుపుతున్నారని.. హైదరాబాద్‌లో ఈ సమావేశం ఉంటుందని అన్నారు.

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏపీ బస్సులు ఎక్కువగా ఉండేవని తెలిపిన ఆయన.. ఏపీ బస్సులు తెలంగాణలో 2 లక్షల 61 వేల కిలోమీటర్లు.. తెలంగాణ బస్సులు ఏపీలో లక్షా 50 వేల కిలో మీటర్లు తిరుగుతున్నాయని వివరించారు. ఏపీలో తెలంగాణ బస్సు సర్వీసులు ఎక్కువ తిప్పినా.. తమకు అభ్యంతరం లేదన్న ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గితే ప్రైవేట్ బస్సులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అనుమతి రాగానే రాష్ట్రంలో సిటీ బస్సులు నడుపుతామని కృష్ణబాబు వెల్లడించారు.