ఇక జమ్ము కశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు…!

జమ్ము కశ్మీర్‌ అందాలను ఆస్వాదించడమే కాదు.. వీలుంటే అక్కడే నివాసం ఏర్పరచుకోవచ్చు.. ఎంచక్కా భూములు కొనేసుకుని అక్కడే ఇల్లు కట్టేసుకోవచ్చు.. ఇలా కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

  • Balu
  • Publish Date - 12:00 pm, Wed, 28 October 20
ఇక జమ్ము కశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు...!

జమ్ము కశ్మీర్‌ అందాలను ఆస్వాదించడమే కాదు.. వీలుంటే అక్కడే నివాసం ఏర్పరచుకోవచ్చు.. ఎంచక్కా భూములు కొనేసుకుని అక్కడే ఇల్లు కట్టేసుకోవచ్చు.. ఇలా కేంద్ర హోం శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. జమ్ముకశ్మీర్‌లోని పలు చట్టాలకు సవరణలు చేసి మరీ ఈ మార్పు తీసుకొచ్చింది.. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు.. సెక్షన్‌ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో.. ఇప్పుడు ఎవరైనా జమ్ముకశ్మీర్‌లో భూములను కొనుక్కోవచ్చు.. అయితే వ్యవసాయ భూములను, వ్యసాయేతరులకు అమ్మడానికి మాత్రం వీల్లేదు.. కాకపోతే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన వాటికి ఉపయోగించుకోవచ్చు.. అయితే సెక్షన్‌ 17లోని హక్కును తొలగించడంపై పీపుల్స్‌ అలియన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.. అలాగే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా కూడా దీనిని తప్పుపట్టారు.. జమ్ముకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారంటూ విమర్శించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులు దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని మెహబూబా వ్యాఖ్యానించారు.