ఎనీ డెస్క్‌తో డేంజర్.. ఎప్పుడైనా దోచేస్తారు..!

Any Desk App : Fraudsters Can Use This App To Steal Money, ఎనీ డెస్క్‌తో డేంజర్.. ఎప్పుడైనా దోచేస్తారు..!

రోజుకో కొత్త పథకంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మార్ట్ ఫోన్‌లను టార్గెట్ చేస్తున్నారు. సింపుల్‌గా ఒక ఫోన్ కాల్‌తో బ్యాంకు ఉద్యోగులమని చెప్పి.. ఎనీ డెస్క్ యాప్‌ని మొబైల్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. ఐడీ, ఓటీపీ నెంబర్లు చెప్పించుకుని తెలివిగా మొబైల్‌ని వారి కంట్రోల్‌లోకి తెచ్చుకుంటున్నారు. మొబైల్‌లో చేసే నెట్ బ్యాంకింగ్ వివరాలు, లావాదేవీలు వారి గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. దీంతో వినియోగదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దోచేస్తున్నారు. అందువల్ల ఎనీడెస్క్ లాంటి యాప్‌లతో లావాదేవీలు జరిపేవారంతా అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ హెచ్చరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *