అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. గురువారం(న‌వంబ‌ర్ 7న‌) అనుష్క పుట్టిన‌రోజుఈ సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్ర‌ముఖ […]

అనుష్క 'నిశ్శబ్దం' టీజర్ విడుదల
Follow us

|

Updated on: Nov 06, 2019 | 9:15 PM

‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. గురువారం(న‌వంబ‌ర్ 7న‌) అనుష్క పుట్టిన‌రోజుఈ సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ప్రీ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచ‌గా.. ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ టీజర్‌పై ఓ లుక్కేయండి.