Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • ప్రధాని అయోధ్య పర్యటన: రేపు ఉదయం 9.35 కు ఢిల్లీ నుంచి బయలుదేరి 10.35కు లక్నో చేరుకుంటారు. 10.40కు లక్నో నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 11.30కు అయోధ్యలో సాకేత్ కళాశాల మైదానంలో దిగుతారు. అక్కణ్ణుంచి నేరుగా 11.40కు హనుమాన్ గడి చేరుకుని 10 నిమిషాలు దర్శనం. అక్కణ్ణుంచి భూమి పూజకు బయలుదేరుతారు. 12.15కు ఆలయ ప్రాంగణంలో ఒక పారిజాత మొక్క నాటుతారు. 12.30కు భూమి పూజ ప్రారంభం. 12.44కు భూమి పూజ. శంఖుస్థాపన. 2.05కు తిరిగి సాకేత్ కాలేజ్ చేరుకుని, 2.20కి తిరుగు ప్రయాణం.
  • ముఖ్యమంత్రి సమీక్ష మరి కాసేపట్లో ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. పాల్గొననున్న సీఎంఓ నీటిపారుదల శాఖ అధికారులు.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • 30 ఇయ‌ర్స్ పృథ్వికి క‌రోనా పాజిటివ్‌. గ‌త ప‌ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాను. అన్ని చోట్ల చూపించా. కొన్ని చోట్ల కోవిడ్ నెగ‌టివ్ అన్నారు. సీటీ స్కాన్‌లు చేయించాను. డాక్ట‌ర్లు... `కొన్నిచోట్ల‌ నెగ‌టివ్ రావ‌చ్చు...` 15 రోజులు క్వారంటైన్‌లో జాయిన్ అవ్వ‌మ‌న్నారు. నిన్న మిడ్‌నైట్ క్వారంటైన్‌లో జాయిన్ అయ్యాను. అంద‌రి ఆశీస్సులు, వెంక‌టేశ్వ‌ర స్వామి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నా మంచి ఆరోగ్యం కోసం పోరాడుతున్నాను.

వెబ్‌ సిరీస్‌కు నో చెప్పిన స్వీటీ..

ఓటీటీలలోని వెబ్‌ సిరీస్‌లకు ఈ మధ్యకాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనితో బడా హీరోలు, హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Anushka Shetty Rejects Web Series Offer, వెబ్‌ సిరీస్‌కు నో చెప్పిన స్వీటీ..

Anushka Shetty Rejects Web Series Offer: కరోనా వైరస్ మొత్తాన్ని మార్చేసింది. ముఖ్యంగా సినీ రంగాన్ని తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. విడుదలకు సిద్దమైన చిన్నా, పెద్ద సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. అంతేకాకుండా షూటింగులు లేక జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్నది ఎవరికీ తెలియట్లేదు.! ఈ తరుణంలో చాలామంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

అటు ఓటీటీలలోని వెబ్‌ సిరీస్‌లకు ఈ మధ్యకాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనితో బడా హీరోలు, హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి ఛాన్స్ ఒకటి స్వీటీ అనుష్క శెట్టి దగ్గరకు వస్తే.. ఆమె సున్నితంగా నో చెప్పిందని టాలీవుడ్ టాక్. ఓ బడా నిర్మాణ సంస్థ అనుష్క ప్రధాన పాత్రలో భారీ వెబ్‌ సిరీస్‌కు ప్లాన్ చేశారట. ఇందులో భాగంగానే ఆమెను సంప్రదించి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే అనుష్క మాత్రం ఆ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు నో చెప్పిందని సమాచారం.

Related Tags