ప్రభాస్, అనుష్క.. అసలు ఏం జరుగుతోంది..?

టాలీవుడ్ హిట్ పెయిర్ ప్రభాస్, అనుష్కల టాపిక్‌ మళ్లీ వార్తలకెక్కింది. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది..? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయానికొస్తే.. ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో కలిసి నటించారు ప్రభాస్, అనుష్క. ఈ నాలుగు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ పెయిర్‌ కాస్త హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక బాహుబలి 2లో ఈ ఇద్దరి మధ్య రొమాన్స్‌కు మంచి […]

ప్రభాస్, అనుష్క.. అసలు ఏం జరుగుతోంది..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 15, 2019 | 3:42 PM

టాలీవుడ్ హిట్ పెయిర్ ప్రభాస్, అనుష్కల టాపిక్‌ మళ్లీ వార్తలకెక్కింది. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది..? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అసలు విషయానికొస్తే.. ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో కలిసి నటించారు ప్రభాస్, అనుష్క. ఈ నాలుగు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ పెయిర్‌ కాస్త హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. ఇక బాహుబలి 2లో ఈ ఇద్దరి మధ్య రొమాన్స్‌కు మంచి మార్కులు పడగా.. వారిద్దరు రియల్ కపుల్ అయితే బావుంటుందని అభిమానులు కోరుకున్నారు. దీనికి తగ్గట్లుగా అటు అనుష్క, ఇటు ప్రభాస్ పెళ్లి వార్తలొచ్చిన ప్రతిసారి.. వీరిద్దరు ఒకటి కానున్నారని గాసిప్స్ వినిపిస్తూనే వచ్చాయి. అయితే వీటిపై ఈ ఇద్దరు వేరు వేరు సందర్భాలలో స్పందిస్తూ.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని, రియల్ లైఫ్‌ కపుల్ కాలేమంటూ స్పష్టం చేశారు. అయితే అప్పటితో ఈ గాసిప్‌లకు పుల్‌స్టాప్ పడ్డా.. తాజాగా మరోసారి ఈ ఇద్దరు వార్తలకెక్కారు.

ప్రభాస్ హీరోగా నటించిన సాహో టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ టీజర్‌ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు టీజర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు కూడా చేశారు. ఇక దీనిపై అనుష్క స్పందిస్తూ.. సాహో టీజర్ చాలా బావుంది. మూవీ యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ అసలు మీ మధ్య ఏం నడుస్తోంది..? మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ గాసిప్‌లను పక్కనపెడితే అనుష్క, ప్రభాస్ మంచి స్నేహితులు. అందుకే ఒకరి సినిమాలకు మరొకరు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ ప్రమోట్ చేస్తుంటారని వారి సన్నిహితులు చెబుతుంటారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..