‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ మూవీని దర్శకులకు అంకితమిచ్చిన డైరెక్టర్

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా.. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు.

'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' మూవీని దర్శకులకు అంకితమిచ్చిన డైరెక్టర్
Follow us

|

Updated on: Feb 24, 2020 | 3:45 PM

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా.. హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సినిమా కొత్త ట్రైలర్ విడుదల చేశారు. మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “సినిమాలోని నలుగురు హీరోయిన్లలో నేను ఒక అమ్మాయిగా నటించాను. ధన్య అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. నా కెరీర్ లో నేను చేసిన ఎక్స్పెరిమెంటల్, ఎక్సైటింగ్ సినిమా ఇది” అని అన్నారు.

సిద్ధీ ఇద్నాని మాట్లాడుతూ “చిన్నప్పటినుండి స్నేహితులైన నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది. థియేటర్లలో హాయిగా నవ్వుకోవచ్చు. థియేటర్లకు రండి. సినిమా చూడండి” అని అన్నారు.

త్రిధా చౌదరి మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను సోలో హీరోయిన్‌గా సినిమాలు చేశా. ఫస్ట్ టైం ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించా. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పుడు హీరో అవసరమా? మేము ఈ సినిమాకు షీరోస్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సినిమా ఇది. కథలో హీరోయిన్లు నలుగురు పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది” అని అన్నారు.

కోమలి ప్రసాద్ మాట్లాడుతూ “హీరోయిన్‌గా నా సెకండ్ ఫిల్మ్ ఇది. సినిమా చాలా బాగుంటుంది. నెలంతా కష్టపడి అలసిపోయిన ప్రేక్షకులు… మార్చి 6న హాయిగా రెండు గంటలపాటు నవ్వుకోవడానికి మా సినిమా థియేటర్లకు రండి. రెండోసారి.. మూడోసారి.. నాలుగోసారి.. ఎన్నిసార్లైనా చూడొచ్చు. పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు” అని అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ “ఇన్ని రోజులు మీడియాలో ఒకడిగా, మీడియా సభ్యుల మధ్య ఉన్నాను. ఇప్పుడు మీడియా ముందు నన్ను నిలబెట్టారు. మీడియా నుండి వచ్చి ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది పెద్ద స్టెప్. అందులో ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. చాలామంది దర్శకులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని, దర్శకులు అందరికీ ఈ సినిమాను అంకితం చేస్తున్నా. వినోదంతో కూడిన మంచి కథతో సినిమా తీశా. నా వైఫ్ హిమబిందు నిర్మాతగా మారి ఇ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. రఘురామ్ సపోర్ట్ కూడా మరువలేనిది. సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆల్మోస్ట్ మూడు కోట్ల బడ్జెట్ అయ్యింది” అని అన్నారు.

చిత్ర సహనిర్మాత రఘురామ్‌ యేరుకొండ మాట్లాడుతూ “నలుగురు అందమైన అమ్మాయిలతో అందంగా, అద్భుతంగా బాలు గారు సినిమా తీశారు. మార్చి 6న విడుదలవుతోంది. ప్రేక్షకులందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

చిత్ర నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ “బాలు దర్శకుడు అవుతానని చెప్పినప్పుడు షాకయ్యా. కథ విన్న తర్వాత ట్రై చేయమని చెప్పాను. తర్వాత మేమే సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాము. రఘురామ్ గారు, శ్రీరామ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు” అని అన్నారు.

నటీనటులు: ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు: ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్.. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి.. ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌.. సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని.. సంగీతం: వికాస్‌ బాడిస… కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి… సహ నిర్మాత: రఘురామ్‌ యేరుకొండ.. నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌.. రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!