Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • నిమ్స్ లో లాంఛనంగా ప్రారంభమైన బూస్టర్ డోసేజ్ . క్లినికల్ ట్రయల్స్ లో మొదటి దశ-రెండో దశకు మధ్యలో వాలంటీర్లకు బూస్టర్ డోసేజ్. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన వైద్య బృందం. నిన్న 11 మంది వలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన నిమ్స్ వైద్య బృందం. నేడు మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్న నిమ్స్ వైద్య బృందం.
  • బులియన్ మార్కెట్: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. రూ.1,317 తగ్గిన బంగారం ధర. ఏకంగా రూ. 2,900కు పైగా తగ్గిన వెండి ధర. రూపాయి బలపడటమే కారణమన్న నిపుణులు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో మంత్రి మండలి సమావేశం. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటిఆర్ గారి సమన్వయం లో మొదలైన సమావేశం. హాజరయిన మంత్రులు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

షాకింగ్‌ న్యూస్‌.. కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశం

కరోనాపై పోరాటంలో శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
Coronavirus shocking news, షాకింగ్‌ న్యూస్‌.. కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశం

కరోనాపై పోరాటంలో శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో సాధారణ జలుబులాగానే కరోనా కూడా మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ”శరీరంలో వైరస్‌కి ధీటైన యాంటీబాడీలు తయారవుతున్నాయి. అయితే కొంత కాలానికే అవి తగ్గిపోతున్నాయి” అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కేటీ డూరెస్ తెలిపారు. కరోనా సోకిన 65 మందిపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.

”కరోనాపై పోరాటంలో వ్యాధి నిరోధక శక్తి చాలా కీలకం. కానీ యాంటీబాడీలు వైరస్‌తో పోరాటం చేస్తాయి. అయితే యాంటీబాడీలు మూడు నెలల్లోనే తగ్గిపోతున్నాయంటే వ్యాక్సిన్లు కూడా అంతే అనుకోవచ్చు. ఒకసారి వ్యాక్సిన్ వేస్తే సరిపోదు. మళ్లీ వేయాల్సిన అవసరం ఉండొచ్చు” అని కేటీ అన్నారు. అయితే ”ఎక్కువ మందికి కరోనా సోకితే సామూహిక నిరోధక వస్తుందని చాలా మంది యువత కరోనాను అంటించుకుంటున్నారు. దీని వలన వారు మాత్రమే కాదు.. ఇతరులనూ ప్రమాదంలో పడేస్తారు” అని హెచ్చరించారు.

Related Tags