వైట్ హౌస్ లోని ‘కరోనా బృందమంతా’ సెల్ఫ్ ఐసొలేషన్ లో !

అమెరికా  అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి కరోనా ఎంటరైంది. ఇప్పటికే ఈ రాజసౌధంలో ముగ్గురికి ఈ వైరస్ సోకగా.. ఇక ఎందుకైనా మంచిదని ఇక్కడ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆంథోనీ ఫోజీ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారు..

వైట్ హౌస్ లోని 'కరోనా బృందమంతా' సెల్ఫ్ ఐసొలేషన్ లో !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 2:44 PM

అమెరికా  అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి కరోనా ఎంటరైంది. ఇప్పటికే ఈ రాజసౌధంలో ముగ్గురికి ఈ వైరస్ సోకగా.. ఇక ఎందుకైనా మంచిదని ఇక్కడ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆంథోనీ ఫోజీ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారు. ఈయనతో బాటు రాబర్ట్ రెడ్ ఫీల్డ్, స్టీఫెన్ హాన్ అనే మరో ఇద్దరు సభ్యులు కూడా ఇక స్వీయ నియంత్రణలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరిలో రాబర్ట్….  సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ కాగా.. స్టీఫెన్.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పదవిలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్ సైతం కరోనా వైరస్ బారిన పడింది. ఇలా వైట్ హౌస్ లో క్రమక్రమంగా అందరూ ఈ ఇన్ఫెక్షన్ కి గురవుతున్నారు. దీంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది. తాను  ఇక్కడి స్టాఫ్ లో ఎవరితోనూ కాంటాక్ట్ లోకి రాలేదని, అందువల్ల మాడిఫైడ్  క్వారంటైన్ లో ఉంటానని ఫోజీ చెప్పారు. ఈయన రెండు వారాలపాటు ఇంట్లో కూడా మాస్క్ తోనే ఉంటారట. ఈయన రోజూ కార్న్ టెస్ట్ చేయించుకుంటున్నా నెగెటివ్ అని వస్తోంది. అయినా ఎందుకైనా మంచిదని సెల్ఫ్ క్వారంటైన్  బాట పట్టారు.