అంతర్వేది: డిసెంబర్ నాటికి కొత్త రథం పూర్తి

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోసం తయారు చేస్తున్న నూతన రథం నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని

  • Tv9 Telugu
  • Publish Date - 10:53 am, Tue, 29 September 20

Antarvedi new chariot: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోసం తయారు చేస్తున్న నూతన రథం నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు వెల్లడించారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తెలుగు క్యాలెండర్‌ ప్రకారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక రథోత్సవం వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న వస్తుందని ఆయన అన్నారు. ఆ రోజు నూతన రథంపైనే స్వామి వారి ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాంప్రదాయ, ఆచార పద్ధతులన్నింటినీ అనుసరించి కొత్త రథం రూపుదిద్దుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం అధిక నాణ్యత గల బస్తర్‌ టేక్‌ వుడ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కాగా ఆలయంలోని 60ఏళ్ల నాటి రథం ఇటీవల దగ్ధమైంది. ఎవరో దుండగులు కావాలనే ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read More:

తీవ్ర జ్వరం.. ఎయిమ్స్‌లో చేరిన ఉమా భారతి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,072 కొత్త కేసులు.. 9 మరణాలు