ఏఎన్నార్, హరికృష్ణ, దాసరి విగ్రహాల తొలగింపు

విశాఖపట్టణంలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. అనుమతులు లేకుండా ఉన్నాయంటూ బీచ్‌రోడ్డులోని మూడు విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. వాటిలో దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరరావు, హరికృష్ణ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల పలు ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ విగ్రహాలను తొలగించాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తుతో జీవీఎంసీ అధికారులు విగ్రహాలను తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *