విశాఖజిల్లా నాటుతుపాకీ కేసులో మరో ట్విస్ట్‌

విశాఖజిల్లా నాటుతుపాకీ కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పూర్ణరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అడవి జంతువు అనుకొని బలరాంపై పూర్ణారావు కాల్పులు జరిపినట్టు విచారణలో వెల్లడైంది…

  • Sanjay Kasula
  • Publish Date - 10:40 pm, Mon, 19 October 20

విశాఖజిల్లా నాటుతుపాకీ కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పూర్ణరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అడవి జంతువు అనుకొని బలరాంపై పూర్ణారావు కాల్పులు జరిపినట్టు విచారణలో వెల్లడైంది. నాటు తుపాకులు ఉన్న హరి, భగత్‌రాం, ఆనంద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి ఐదు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం డుంబ్రిగుడ మండలం గదబగలుగులో వేటకు వెళ్లిన బలరాం తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు. ఐతే ఈ ఘటనపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో…పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో అస్సలు విషయం బయటకొచ్చింది.