జగన్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. వంశీ బాటలో మరో ఎమ్మెల్యే..?

ఏపీలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో.. ఆ పార్టీకి కౌంటర్‌గా వైఎస్ జగన్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలెట్టింది. మొన్నటివరకు ఇతర పార్టీల్లో పదవిలో లేని సీనియర్లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు పదవిలో ఉన్న వారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే జగన్‌‌తో భేటీ అయ్యారు. ఇక పార్టీ […]

జగన్ 'ఆపరేషన్ ఆకర్ష్'.. వంశీ బాటలో మరో ఎమ్మెల్యే..?
Follow us

| Edited By:

Updated on: Oct 26, 2019 | 9:58 AM

ఏపీలో రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో.. ఆ పార్టీకి కౌంటర్‌గా వైఎస్ జగన్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలెట్టింది. మొన్నటివరకు ఇతర పార్టీల్లో పదవిలో లేని సీనియర్లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. ఇప్పుడు పదవిలో ఉన్న వారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే జగన్‌‌తో భేటీ అయ్యారు. ఇక పార్టీ మార్పు కోసం వైసీపీ పెట్టుకున్న రాజీనామా నిబంధన అడ్డంకిగా మారనున్నందున మథ్యేమార్గంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో దీపావళి తరువాత పార్టీ మార్పుపై తాను క్లారిటీ ఇస్తానని వల్లభనేని వంశీ కూడా వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇదే బాటలో త్వరలో మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కూడా త్వరలో జగన్‌ను కలిసి పార్టీ మార్పుపై చర్చించబోతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్ సందడి చేసిన విషయం తెలిసిందే. అప్పుడే పార్టీ మార్పుపై ఎంపీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు కరణంతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే రాష్ట్రంలో టీడీపీ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోవాల్సిందే.