పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ చేశాం… అమిత్ షా

Amit Shah Praises Team India After Big Win with Pakistan In ICC Wold cup 2019, పాక్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ చేశాం… అమిత్ షా

ఆదివారం రాత్రి పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ జరిగిందన్నారు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అయితే ఈ సారి లండన్ వేదికగా చేశామని చమత్కరించారు. ప్రపంచకప్‌లో ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. దీంతో ఈ విజయంపై దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందించారు.

అయితే అమిత్ షా.. తన ట్విట్టర్‌లో భారత్, పాక్‌ను ఓడించడాన్ని సర్జికల్ స్ట్రైక్‌తో పోల్చుతూ.. ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్ చేసిన… భారత టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ అత్యద్భుత విజయం ప్రతీ భారతీయునికీ గర్వకారణం” అని వ్యాఖ్యానించారు. అయితే షా చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *